‘గార్గీ’ కోసం అన్నీ తానే అయిన సాయి పల్లవి.!
- July 12, 2022
సాయి పల్లవి అంటే అందరికీ ఓ ప్రత్యేకమైన అభిమానం వుంది. ఓ హీరోయిన్ అనే కన్నా, మంచి నటిగా సాయి పల్లవి ఆ గుర్తింపు దక్కించుకుంది. నటి అనే కన్నా, పక్కింటమ్మాయ్, కాదు కాదు, మన ఇంట్లో అమ్మాయ్యే అనేంతలా సాయి పల్లవిని ఓన్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు.
అలాంటి సాయి పల్లవి నటించిన సినిమాలంటే కూడా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలానే వుంటాయ్.. ఖచ్చితంగా విషయమున్న సినిమాల్లోనే సాయి పల్లవి నటిస్తుంది.. అనే ఓ పక్కా అభిప్రాయంతో వుంటారు అభిమానులు.
నిజానికి ‘విరాట పర్వం’ వంటి సినిమాలు చాలా కొద్ది మంది ప్రేక్షకులకే నచ్చుతాయ్. కానీ, సాయి పల్లవి నటించిన సినిమా కాబట్టి, ‘విరాటపర్వం’ సినిమాని సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేందుకు ఇష్టపడ్డారు. అందులో ‘వెన్నెల’ పాత్రలో అనుకున్న అంచనాల్ని సాయి పల్లవి అందుకుందనుకోండి.
అయితే, సినిమా రిజల్ట్ మాత్రం బెడిసికొట్టింది. అది వేరే సంగతి. తాజాగా సాయి పల్లవి ‘గార్గీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతల్నిపూర్తిగా సాయి పల్లవి తన భుజాలపై వేసుకుందట. తెలుగుతో పాటు, తమిళ తదితర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తెలుగులో ఈ సినిమాని ప్రెజెంట్ చేయాల్సిందిగా రానాని కోరిందట సాయి పల్లవి. సాయి పల్లవి అడిగితే రానా కాదనగలడా.? వెంటనే ఓకే అనేశాడట. అలాగే, తమిళంలో ఈ సినిమాని ప్రొజెక్ట్ చేయడానికి సూర్య, జ్యోతికలు ఒప్పుకున్నారట. ఇలా ఈ సినిమాని కేవలం ఆర్టిస్టుగానే కాకుండా నిర్మాత బాధ్యతలు కూడా తీసుకుంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి ఈజ్ గ్రేట్ అంటూ అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ శుక్రవారం ‘గార్గీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!