మీ అరాచకాలు ఇంకెన్నాళ్లు జగన్ గారూ: నారా లోకేశ్
- July 12, 2022
అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్ మరోసారి వైఎస్‌ఆర్‌సిపి సర్కార్‌పై మండిపడ్డారు. ఓటు వేయని వారిపై వేటు వేయడం వైఎస్‌ఆర్‌సిపి నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని విమర్శించారు. తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైఎస్‌ఆర్‌సిపి దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ లు, హత్యలు చేయడం వంటివాటిని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చూశామని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమికి కారణమయ్యాడనే కక్షతో వారి ఇంటిని వైఎస్‌ఆర్‌సిపినేత పోలయ్య కబ్జా చేశాడని మండిపడ్డారు.
అధికారం అండతో పోలయ్య ఇంటిని ఆక్రమించడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డిగారూ అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండని ట్విట్టర్ వేదికగా సూచించారు. దీంతోపాటు ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!