ఎక్స్ పాట్ ఇన్సైడర్ రిపోర్ట్ 2022.. టాప్ 10లో ఖతార్
- July 15, 2022
ఖతార్: ఇంటర్నేషన్స్ ఎక్స్‌పాట్ ఇన్సైడర్ రిపోర్ట్ 2022 ప్రకారం.. ప్రవాస మహిళల కోసం ఉత్తమ జీవన నాణ్యత విభాగంలో ప్రపంచంలో 8వ స్థానంలో ఖతార్ నిలిచింది. అలాగే ప్రవాసుల కోసం 26వ ఉత్తమ ప్రదేశంగా స్థానం సంపాందించింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్‌లోని హెల్త్ అండ్ వెల్-బీయింగ్ సబ్కేటగిరీలో ఖతార్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఎక్స్‌పాట్ ఎసెన్షియల్స్ ఇండెక్స్‌లో ఖతార్ 8వ స్థానంలో నిలిచింది. కువైట్ మినహా అన్ని గల్ఫ్ రాష్ట్రాలు టాప్ 10లో ఉన్నాయి. ఇండెక్స్ 52 దేశాలను నాలుగు విభాగాల్లో సర్వే చేసింది. డిజిటల్ లైఫ్ కేటగిరీలో ఖతార్ 17వ స్థానంలో ఉంది. అడ్మిన్ అంశాలలో 10వ స్థానంలో, హౌసింగ్‌లో 24వ స్థానంలో.. భాషలో 4వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషన్స్ ఎక్స్ పాట్ ఇన్సైడర్ 2022 సర్వే 177 జాతీయతలను కవర్ చేస్తూ.. 181 దేశాల్లో నివసిస్తున్న దాదాపు 12,000 మంది నుండి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో భాగంగా నిర్వాసితుల జీవన నాణ్యత, సులభంగా స్థిరపడడం, విదేశాల్లో పని చేయడం, వారి సంబంధిత దేశంలో వ్యక్తిగత ఆర్థిక సహాయంతో సంతృప్తి, డిజిటల్ లైఫ్, అడ్మిన్ టాపిక్స్, హౌసింగ్, లాంగ్వేజ్ వంటి అంశాలపై సర్వే నిర్వహించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!