భారత్: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్
- July 17, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని చేరుకోబోతుంది. త్వరలో 200 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవబోతుంది. శనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇది. జనవరి 16, 2021న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. ఫిబ్రవరి 2, 2021 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ అందించారు. అదే ఏడు మార్చి 1న సీనియర్ సిటిజన్స్‌కు, ఏప్రిల్ 1న 45 సంవత్సరాలు దాటిన వారికి, మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్టోబర్ 21 న వంద కోట్ల మార్కు దాటింది. ఈ ఏడాది జనవరి 3న 15-18 ఏళ్లు కలిగిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. జనవరి 10 నుంచి బూస్టర్ డోసును ప్రారంభించారు.
అయితే, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే. మార్చి 16న 12-14 ఏళ్ల వయసు కలిగిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో భాగంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వాలని.. అది కూడా ఉచితంగా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఉచిత బూస్టర్ డోసుల కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభమైంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







