బీమా రంగం పై దృష్టి సారించిన ప్రభుత్వం

- July 18, 2022 , by Maagulf
బీమా రంగం పై దృష్టి సారించిన ప్రభుత్వం

కువైట్: ఇప్పటికే 80 శాతం బ్యాంకింగ్ మరియు టెలికామ్ రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇస్తున్న కువైట్ ప్రభుత్వం,  తాజాగా దేశ బీమా రంగం పై దృష్టి కేంద్రీకరించింది. 

అధికారిక సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగాల్లో కువైట్ వాసులకే ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అంతేకాకుండా రాబోయే రెండు సంవత్సరాల్లో బీమా రంగం లో పనిచేస్తున్న విదేశీయులను తొలగించి 3,000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించింది. 

ప్రస్తుతం కువైట్ లో స్థానికులు మరియు విదేశీయులు కలిపి సుమారు రెండు మిలియన్ల మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కంపెనీల్లో పనిచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com