దోఫార్ రోడ్డు పై ప్యాట్రోలింగ్ బృందం

- July 18, 2022 , by Maagulf
దోఫార్ రోడ్డు పై ప్యాట్రోలింగ్ బృందం

మస్కట్: ఇటీవల కాలంలో దోఫార్ ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఆ రోడ్డు పై పోలీసులు నిఘా పెట్టారు. 

రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తులు అధికంగా ఉన్న దోఫార్ ప్రావిన్స్ మీద దృష్టి సారించామని అందులో భాగంగానే ఆ ప్రావిన్స్ కు వెళ్ళే దారిలో ప్యా ట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందం పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. వీరి సేవల కొరకు 9999 కు డయల్ చేయొచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com