హైదరాబాద్ లో భారీ వర్షం...
- July 22, 2022హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది.. జూబ్లీహిల్స్, మూసాపేట్, కేపీహెచ్ బి యూసుఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఇక్కట్లు పడుతున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ , కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు