సీక్రెట్ టాలెంట్ బయట పెట్టిన నితిన్ హీరోయిన్.!

- July 22, 2022 , by Maagulf
సీక్రెట్ టాలెంట్ బయట పెట్టిన నితిన్ హీరోయిన్.!

‘లై’ బ్యూటీ మేఘా ఆకాష్ అంటే కేవలం నటి మాత్రమే కాదండోయ్. అమ్మడిలోనూ కొన్ని సీక్రెట్ టాలెంట్స్ వున్నాయ్. అందులో ఒకటి తాజాగా బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తమిళంలో ఓ సినిమా కోసం తనలోని సింగింగ్ టాలెంట్‌ని బయటకి తీసింది మేఘా ఆకాష్. ‘సింగిల్ శంకరం స్మార్ట్‌ఫోన్ సమ్రానుం’ అనే ఓ తెలుగు సినిమా కోసం మేఘా ఆకాష్ తన గొంతు సవరించుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన మేఘా ఆకాష్ ఆడియో సాంగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కాగా, ‘లై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా ఆకాష్, ఆ తర్వాత కూడా నితిన్‌తోనే (ఛల్ మోహన్ రంగ సినిమా) జత కట్టడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ నితిన్‌తో రెండు సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది. ఈ లోపు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించింది. అందులో రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సినిమాలుండడం మరో విశేషం. 
కాగా, రీసెంట్‌గా శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘రాజ రాజ చోర’ సినిమాతో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ, హిందీ సినిమాల్లోనూ మేఘా ఆకాష్ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’, ‘రావణాసుర’, ‘డియర్ మేఘా’ తదితర సినిమాల్లో మేఘా ఆకాష్ నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com