ముగ్గురు భారతీయులకు బ్రహ్మాండమైన గోల్డెన్ చాన్స్
- April 13, 2016
ముగ్గురు భారతీయులకు బ్రహ్మాండమైన గోల్డెన్ చాన్స్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన విద్యావేత్తలు, సామాజికంగా నిబద్ధత కలిగిన 55 మందిని ఎంపిక చేసి వారికి ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్స్ ప్రకటించగా, ఆ జాబితాలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. సాగ్నిక్ దత్తా, సంపూర్ణ చక్రవర్తి, మాళవికా నాయర్.. ఈ ముగ్గురికీ ఆ స్కాలర్‌షిప్ లభించింది. 30 దేశాలకు చెందిన 55 మంది విజేతలు 68 యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం విజేతల్లో 36 మంది మహిళలు కాగా, 19 మంది మాత్రమే పురుషులున్నారు.సాగ్నిక్ దత్తా ఆరేళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేసి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో చదువుతున్నారు. ఆమె ఇప్పుడు ఈ స్కాలర్‌షిప్‌తో రాజకీయాలు, అంతర్జాతీయ పరిశోధనలో పీహెచ్‌డీ చేస్తారు. సంపూర్ణ చక్రవర్తి ఫార్మకాలజీలో పీహెచ్‌డీ చేయనున్నారు. ప్రధానంగా ఆర్థరైటిస్ నొప్పులకు మందు కనుక్కోవడంపై ఆమె దృష్టిపెడతారు. మెటీరియల్ సైన్స్, మెటలర్జీలలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చేసేంఉదకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో మాళవికా నాయర్ చేరారు. ఈ స్కాలర్‌షిప్‌తో ఆమె మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







