ఒమన్ ఆరోగ్య సంస్థల్లో పని గంటల క్రమబద్ధీకరణ

- July 23, 2022 , by Maagulf
ఒమన్ ఆరోగ్య సంస్థల్లో పని గంటల క్రమబద్ధీకరణ

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో పని గంటలను క్రమబద్ధీకరించడానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హిలాల్ బిన్ అలీ అల్ సబ్తి మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో పని గంటల నియంత్రణకు సంబంధించి మంత్రివర్గం తాజా సిఫార్సుల నేపథ్యంలో సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ఆరోగ్య సేవలు విస్తృతం కానున్నాయి. అలాగే ప్రజలు మరింత ఆరోగ్య సేవలు మరింత దగ్గరవుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్య సంస్థలను అనుసరించి కొత్త పని వేళలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com