కమల్ హాసన్‌కు యూఏఈ గోల్డెన్ వీసా
- July 23, 2022
దుబాయ్: విశ్వనటుడు కమల్ హాసన్ కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది.యూఏఈ ప్రభుత్వం ఆయనకు దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కల్పించే గోల్డెన్ వీసా మంజూరు చేసింది. తాజాగా కమల్ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, అధికారులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. "యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి గోల్డెన్ వీసా అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్ ఆఫీస్ సందర్శన సందర్భంగా సహకరించిన జీడీఆర్‌ఎఫ్ఏ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రీకి ధన్యవాదాలు." అని కమల్ ట్వీట్ చేశారు. అలాగే ప్రతిభావంతులు, సృజనాత్మక వ్యక్తులకు మద్దతు ఇస్తున్నందుకు దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

I’m honored to receive the Golden Visa from United Arab Emirates.

Thank you Lieutenant General Mohammed Ahmed Al Marri, Director General GDRFA for tour in General Directorate of Residency and Foreigners Affairs offices in Dubai. (1/2) pic.twitter.com/2PWZLbZgd1
— Kamal Haasan (@ikamalhaasan) July 21, 2022

తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!