కార్మికులు వార్షిక సెలవుల ఫార్వార్డుకు అనుమతి
- July 23, 2022
యూఏఈ: కార్మికుడు లేదా ఉద్యోగి తన వార్షిక సెలవులో సగానికి మించకుండా తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ లేదా నగదు పరిహారం పొందేందుకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) అనుమతి ఇచ్చింది. కార్మికుల పనిగంటలు, కార్యనిర్వాహక నిబంధనలకు సంబంధించి 2021కి సంబంధించిన ఫెడరల్ డిక్రీ లా No33 ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కార్మికుడి కాంట్రాక్టు రద్దయిన సందర్భంలో ప్రాథమిక వేతనానికి అనుగుణంగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన వార్షిక సెలవుల బ్యాలెన్స్‌కు సమానమైన నగదు భత్యాన్ని తప్పనిసరిగా చెల్లించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికుడు తన వార్షిక సెలవును రెండేళ్లకు మించి తీసుకోకూడదనుకుంటే, లేదా కార్యాలయంలో వర్తించే నిబంధనలకు అనుగుణంగా అతను దాని కోసం నగదు భత్యాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్ట్‌టైమ్ ఉద్యోగి కూడా వార్షిక సెలవులు పొందడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







