టిఆర్ఎస్ ఎన్నారై కువైట్ ఆధ్వర్యంలో KTR పుట్టినరోజు వేడుకలు..
- July 24, 2022
కువైట్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పుట్టినరోజు వేడుకలు టిఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ... కేటీఆర్ ఒక్క ట్వీట్ తోనే స్పందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారని, ఆపదలో అందరికి అండగా నిలుస్తూ నవతరానికి యువనాయకుడిగా యువతను ముందుకు నడిపిస్తూ, విజ్ఞానమే ఆయుధంగా వినయమే ఆభరణంగా పరిపాలనలో ఉత్తెజమై అద్భుతమైన పాలన అందిస్తున్నారు అని అన్నారు. అలాగే భవిష్యత్తులో కెసిఆర్ గారిని ప్రధానమంత్రిగా, మరియు KTR ని ముఖ్యమంత్రిగా చూడాలని, కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అభిలాష పేర్కొని కేక్ కట్ చేసి కువైట్ టీం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ మాట్లాడుతూ KTR లాంటి నాయకులు తెలంగాణ కి దొరకడం అదృష్టం అని అలాంటి నాయకుడిని అందించిన KCR కి ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.సుభాన్ సోహీల్ మాట్లాడుతూ కువైట్ లోని అన్ని తెలుగు సంఘాల తరుపున KTR గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఅర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, సురేష్ గౌడ్, సుభాన్ సొహీల్, రవి గన్నరపు, అయ్యప్ప, ప్రమోద్ కుమార్ మర్క, రవి సుధగని, అశోక్ చార్య, మహమ్మద్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







