యూఏఈలో జులై 30న సెలవు
- July 25, 2022
యూఏఈ: ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా UAEలోని అన్ని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జూలై 30న అధికారిక (పెయిడ్) సెలవును ప్రకటించారు. 2021, 2022లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించిన అధికారిక సెలవులపై యూఏఈ క్యాబినెట్ జారీ చేసిన డిక్రీకి అనుగుణంగా సెలవును ప్రకటించినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. సౌర వ్యవస్థపై ఆధారపడిన గ్రెగోరియన్ క్యాలండర్ లా కాకుండా.. ఇస్లామిక్ నూతన సంవత్సరం చంద్ర వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్లో మొహర్రం మొదటి నెల. దీనిని ఇస్లామిక్ న్యూ ఇయర్ - హిజ్రీ న్యూ ఇయర్ లేదా అరబిక్ న్యూ ఇయర్ అని కూడా పిలుస్తారని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ సభ్యుడు ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు సందర్భంగా శనివారం (అక్టోబరు 8న) వస్తుంది. UAE జాతీయ దినోత్సవం సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 1, 2, 3 రోజులు సెలవు దినాలు కాగా.. డిసెంబర్ 4న ఆదివారం కావడంతో వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







