విదేశీ రిక్రూట్‌మెంట్ నిబంధనలు కఠినం.. సంస్థలకు జరిమానా, జైలుశిక్ష
- July 25, 2022
రియాద్: విదేశీ ఉద్యోగులను చట్టవిరుద్ధంగా నియమించుకున్న లేదా తమ ఉద్యోగులను ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించే కంపెనీలు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. నిబంధనలు పాటించిన సంస్థలకు SR10,000 వరకు జరిమానాతోపాటు ఐదు సంవత్సరాల వరకు రిక్రూట్‌మెంట్‌పై నిషేధం, అలాగే వారి స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ప్రకటనలు ఇయ్యాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతోపాటు సదరు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, ప్రవాసుడు అయితే సౌదీ అరేబియా నుండి బహిష్కరించబడతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా రెసిడెన్సీ, పని, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను తెలిపాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







