నా రూటే సెపరేటు అంటోన్న నిత్యా మీనన్.!

- July 26, 2022 , by Maagulf
నా రూటే సెపరేటు అంటోన్న నిత్యా మీనన్.!

హీరోయిన్ల యందు నిత్యామీనన్ వేరయా.! అని ఊరకనే అనలేం. అందుకే నిత్యామీనన్‌ని కమర్షియల్ హీరోయినా.? స్పెషల్ హీరోయినా.? అని లెక్కలు వేసి చూడలేం. ఆమె అంతే, భానుమతి సింగిల్ పీస్, హైబ్రీడ్ పిల్ల మాదిరి, నిత్య మీనన్ స్పెషల్ పీస్ అంతే. 
రోబోలా నటించడం నాకు తెలీదు.. అంటూ నిత్యా మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నటిని కాబట్టి, ఏ సినిమా పడితే, ఆ సినిమాలో నటించేయడం నాకు నచ్చదని కుండ బద్దలు కొట్టేసింది నిత్యా మీనన్.

నిత్యామీనన్ స్వతహాగా నటి మాత్రమే కాదు, రైటర్, సింగర్, సినిమాకి సంబంధించి టెక్నికల్ విభాగంలోనూ ప్రావీణ్యం వుంది. అందుకే ఆమె ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రే కనిపిస్తుంది కానీ, నిత్యా మీనన్ కనిపించదు.

ఫిట్‌నెస్ మీదా నిత్యా మీనన్‌కి శ్రద్ధ తక్కువే. అయినా కానీ కొన్ని పాత్రలు ఏరి కోరి నిత్య కోసమే పుడతాయంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా వున్నాయ్. 

కుప్పలు తెప్పలుగా సినిమాలు ఒప్పేసుకోవడం తనకిష్టం వుండదనీ నిత్య మీనన్ చెప్పుకొచ్చింది. అలాగే ఓటీటీలో ఈ మధ్య ‘హైద్రాబాద్ మోడ్రన్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నిత్య నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో ఓ తల్లికి కూతురుగి నిత్య పండించిన హావభావాలు మనసుకు హత్తుకుంటాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com