చిరంజీవి సినిమాలో రవితేజ పాత్ర ఏంటో తెలిసిపోయిందిగా.!

- July 27, 2022 , by Maagulf
చిరంజీవి సినిమాలో రవితేజ పాత్ర ఏంటో తెలిసిపోయిందిగా.!

చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. అందులో రెండు రీమేక్ సినిమాలు కాగా, ఇంకోటి స్ట్రెయిట్ మూవీ. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండడం ఈ సినిమాకి మరో అస్సెట్. అయితే, రవితేజ ఈ సినిమాలో ఏ పాత్ర పోషించబోతున్నాడు.? అనే దానిపై గత కొంత కాలంగా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయ్.

తాజాగా రవితేజ పాత్ర ఇదేనంటూ కొత్త గాసిప్ తెరపైకి వచ్చింది. చిరంజీవికి రవితేజ తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే, సవతి తల్లి కొడుకు అనీ తెలుస్తోంది. సవతి బిడ్డలు అంటే, సహజంగానే వారి మధ్య వైరం వుంటుంది. అలాగే చిరు, రవితేజ పాత్రల మధ్య వైరం వుండబోతోందా.? అంటే అవుననే అంటున్నారు.

వీరిద్దరి మధ్య హై ఓల్టేజ్ ఎమోషనల్ సీన్స్ వుండబోతున్నాయట. కథను చాలా బలంగా తీర్చిదిద్దాడట ఈ సినిమా కోసం బాబీ. చిరంజీవి మత్సకారుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి, చిరు, రవితేజల పాత్రను ఎలా డిజైన్ చేశాడో.! తెరపై ఏ స్థాయి అంచనాలు నమోదు చేస్తాయో ఈ పాత్రలు.? చూడాలి మరి.

అన్నట్లు గతంలో ‘అన్నయ్య’ సినిమాలోనూ రవితేజ, చిరంజీవికి తమ్ముడిగానే నటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com