ఖైతాన్ ప్రచార కార్యక్రమంలో 1220 ఉల్లంఘనలు నమోదు

- July 28, 2022 , by Maagulf
ఖైతాన్ ప్రచార కార్యక్రమంలో 1220 ఉల్లంఘనలు నమోదు

కువైట్ సిటీ: బుధవారం నాడు జరిగిన భద్రతా తనిఖీల్లో భాగంగా 1220 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

వాహనాల సాంకేతిక పరీక్షలో భాగంగా నిర్వహించిన తనిఖీ కార్యక్రమం అంతర్గత మంత్రిత్వశాఖ  సహాయక కార్యదర్శి లెఫ్ట్నెంట్ జనరల్ అన్వర్ అల్ బార్జస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ విభాగం సహాయక కార్యదర్శి మేజర్ జనరల్ జమాల్ అల్ సయేఘ్ మరియు అంతర్గత సాంకేతిక పరీక్షల నిర్వహణ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మిషాల్ అల్ సువైజీ పర్యవేక్షణలో జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డ్రైవింగ్ లైసెన్స్ కు  చెందినవి కావడం విశేషం . రాబోయే మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నమని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com