‘ప్రాజెక్ట్ కె’ గురించి నిర్మాత అశ్వనీదత్ ఎక్కువ చెబుతున్నారా.?
- July 29, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కాగా, ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ రేంజ్‌లో వుండబోతోందట. తెలుగు సినిమా స్థాయిని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుందని చెబుతున్నారు.
షూటింగ్ కోసం కేవలం నాలుగు నెలలు మాత్రమే టైమ్ తీసుకుంటారట. కానీ, గ్రాఫిక్స్ వర్క్ చాలా టైమ్ పడుతుందట. ఆ టైమ్ దాదాపు 9 నెలలు అనీ తెలుస్తోంది. అందుకే 2024 సంవత్సరానికల్లా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.
ఆల్రెడీ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ప్రబాస్, ‘ప్రాజెక్ట్ కె’తో చైనా, అమెరికా మార్కెట్‌ని టార్గెట్ చేయబోతున్నాడట. అందుకే హాలీవుడ్ రేంజ్ మేకింగ్ వుండబోతోందట ఈ సినిమాలో. ఎక్కడా రాజీ పడేదేలే అంటున్నారు నిర్మాత అశ్వనీదత్.
ఎంత బడ్జెట్ అయినా వెనుకాడేదేలేదంటున్నారు. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్న 2024 అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..