ఇక్కడా, అక్కడా అయిపాయె.. పంజాబీకి చెక్కేశావా పాపా.!

- July 30, 2022 , by Maagulf
ఇక్కడా, అక్కడా అయిపాయె.. పంజాబీకి చెక్కేశావా పాపా.!

‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా రూపొందిన ఈ క్యూట్ లవ్ స్టోరీ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ కాలేదు. అలా తొలి సినిమా నిరాశ పరిచింది. 

రెండో ప్రయత్నంగా ‘రాజుగాడు’ సినిమాలో నటించింది అందాల భామ అమైరా దస్తూర్. ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా కూడా అమైరా దస్తూర్‌కి కలిసి రాలేదు. దాంతో ఇంకో అవకాశమే రాలేదు తెలుగులో అమైరా దస్తూర్‌కి. 
దాంతో తమిళ, హిందీ భాషల్లో లక్కు చెక్కు చేసుకుంది. అక్కడా వర్కవుట్ అవ్వలేదు అమ్మడికి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మూవీ ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో నటించేసింది. జాకీచాన్ హీరోగా రూపొందిన చిత్రమిది. జాకీచాన్ సినిమా కదా. అది సూపర్ హిట్టే. కానీ, లోకల్‌గా మాత్రం సత్తా చాటలేకపోతోంది అమైరా దస్తూర్.

ఇక, ఇప్పుడు పంజాబీ తెరపై సందడి చేయబోతోంది. తాజాగా ఓ పంజాబీ మూవీకి ఓకే చెప్పింది అమైరా దస్తూర్. ‘ఫర్తీలా’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో నటిస్తున్నట్లు అమైరా తాజాగా అనౌన్స్ చేసింది. చూడాలి మరి, పంజాబీలోనైనా సక్సెస్ దక్కుతుందేమో ఈ అందగత్తెకి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com