విజయ్ ‘లైగర్’‌తో అయినా ‘అది’ సాధ్యమవుతుందా.!

- August 01, 2022 , by Maagulf
విజయ్ ‘లైగర్’‌తో అయినా ‘అది’ సాధ్యమవుతుందా.!

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘లైగర్’. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరెక్కించిన చిత్రమిది. తొలిసారి విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా లెవల్‌లో నటించిన ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ ఇంకా చాలా వుంది. కానీ, అప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసేశాడు మనోడు. ప్రమోషన్ల పేరు చెప్పి దేశం మొత్తం టూర్స్ ప్లాన్ చేశాడు. ఎక్కడ విజయ్ ఈవెంట్ పెట్టినా, అక్కడికి జనం లక్షల్లో పోటెత్తేస్తున్నారు.
అది చూసి, విజయ్ కూడా ఆశ్చర్యపోతున్నాడు. మా నాన్న మీకు తెల్వద్, మా తాత మీకు తెల్వద్.. నాపై మీకు ఎందుకురా ఇంత అభిమానం..! అంటూ అభిమానుల అభిమానానికి విజయ్ భావోద్వేగానికి లోనవుతున్నాడు కొన్నిసార్లు. తాజాగా ముంబైలో ఓ మాల్‌లో విజయ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు.

ఈ ఈవెంట్‌కి వచ్చిన జనం ‘సునామీ’ని తలపిస్తోంది. ఈ జన సునామీని చూసి, విజయ్‌కి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. డిఫరెంట్ ఆటిట్యూడ్, యూత్ ఎట్రాక్షన్.. వంటి విభిన్నమైన లక్షణాలున్నాయ్ హీరోగా విజయ్ దేవరకొండలో. 

అదే విజయ్‌పై అంతటి అభిమానం పెంచుకునేలా చేస్తోంది. సరే, జన సునామీ ఇలా వుంది సరే, కానీ, ‘లైగర్’ పరిస్థితేంటో. ఇది మరో ‘అర్జున్ రెడ్డి’ అవుతుందా.? విజయ్ కెరీర్‌లో. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్. కనీసం విజయ్ పుణ్యమా అని అయినా, బాక్సాఫీస్ కళకళలాడుతుందా.? చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com