ఇటు షూటింగ్‌లు బంద్: అటు షూటింగ్‌లు షురూ.!

- August 01, 2022 , by Maagulf
ఇటు షూటింగ్‌లు బంద్: అటు షూటింగ్‌లు షురూ.!

ధియేటర్లకు జనం రావడం లేదు. హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోయాయ్. సినీ నిర్మాతలు నష్టపోతున్నారు.. అంటూ ఈ సమస్యకు ఓ పరిష్కారం తీసుకొచ్చే నేపథ్యంలో నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
షూటింగ్‌లు ఆపుకుంటున్నాం.. అంటూ దిల్ రాజు మీడియా ముఖంగా చెప్పిన ప్రూఫ్ పదే పదే జనం కూడా విన్నారు. కానీ, స్వయంగా షూటింగులు బంద్ అంటూ చెప్పిన ఆ దిల్ రాజే, తన సినిమా షూటింగ్ కామ్‌గా కానిచ్చేస్తున్నాడు. 

ఎవరైతే చెప్పారో, వాళ్లే పాటించకపోతే, ఇంకేం విలువ వుంటుంది చెప్పండి.? అందుకే ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో ‘వారసుడు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళ హీరో విజయ్ ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి వైజాగ్ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇదే విషయమై షూటింగులు బంద్ అని చెప్పిన ఆయనే తన సినిమా షూటింగ్‌ ఆపకపోవడంపై ఇతర నిర్మాతలు గుస్సా అవుతున్నారు. ఇదే విషయాన్ని దిల్ రాజు వద్దకు తీసుకెళ్లగా, తమిళ హీరోల సినిమాలకు ఈ రూల్ వర్తించదు.. అంటూ ఆయన సమాధానమిచ్చారనీ మీడియా మిత్రులు వాపోతున్నారట. ఇదెక్కడి చోద్యంరా బాబూ..! అంటూ ఇన్ని రోజులుగా ఈ న్యూస్‌ని ఆసక్తిగా వీక్షించిన పిచ్చి జనాల వంతవుతోంది. ఏం చేస్తాం కలికాలం.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com