రూటు మార్చిన మాస్ రాజా: ‘ఆ’ హ్యాట్రిక్‌కి ఛాన్సివ్వనంటున్నాడు.!
- August 02, 2022
‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు రవితేజను నిండా ముంచేశాయ్. అంచనాలు భారీగానే వున్నా, డిజాస్టర్లో రికార్డులు కొల్లగొట్టాయ్. దాంతో రవితేజ తేరుకున్నాడట. ఈ సారి రాబోయే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనుకుంటున్నాడట.
అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అస్సలు నెగ్లిజన్సీ ప్రదర్శించకూడదని డిసైడ్ అయిపోయాడట. రవితేజ ట్రాక్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్‌పై వున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘ధమాకా’. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా.
ట్రాక్ రికార్డు బాగా వున్న నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి దర్శకుడు. మాస్ రాజా మార్క్‌కి తగ్గట్లుగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడట నక్కిన త్రినాధరావు. దాంతో, ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో రవితేజ కూడా సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
‘రామారావు ఆన్ డ్యూటీ’ చూశాకా, షూటింగ్ జరుగుతున్నప్పుడే, రవితేజ అవుట్ పుట్ చూసుకోలేదా.? మరీ ఇంత చెత్త సినిమా ఎలా చేశాడంటూ, ఆయన ఫ్యాన్సే రవితేజను తిట్టి పోసేశారు. దాంతో, ఈ సారి ఆ తప్పు చేయనంటున్నాడట మాస్ రాజా.
ఇదిలా వుంటే, తదుపరి, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా విషయంలోనూ తగ్గేదేలే.. అంటున్నాడట మాస్ రాజా.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..