తొలగిన అడ్డంకి.. ఇక కాబాను తాకవచ్చు
- August 04, 2022
సౌదీ: రెండు సంవత్సరాలకు పైగా విరామం తర్వాత పవిత్ర మక్కాలోని గ్రాండ్ మస్జీదు వద్ద యాత్రికులు పవిత్ర కాబా, హజర్ అల్ అస్వాద్ (నల్ల రాయి) లను తాకే, ముద్దు పెట్టుకునే అవకాశాన్ని కల్పించారు. రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ అధిపతి డాక్టర్ షేక్ అబ్దుల్రహ్మాన్ అల్ సుదైస్ ఆదేశాలకు అనుగుణంగా సౌదీ అధికారులు పవిత్ర కాబా చుట్టూ ఉన్న రక్షణ అడ్డంకులను తొలగించారు. పవిత్ర కాబా చుట్టూ ఉన్న అన్ని బారికేడ్లను కార్మికులు తొలగిస్తున్నట్లు చూపించే వీడియోను సౌదీ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ఈ ఏడాది ఆగస్టు నుంచి యాత్రికుల కోసం ఉమ్రాను తెరిచింది. గత రెండు సంవత్సరాలుగా COVID-19 మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరాన్ని కొనసాగించడానికి యాత్రికులు పవిత్ర కాబా తాకేందుకు అనుమతించడంలేదు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







