జూలైలో 473 ఉల్లంఘనలు.. 2,000 ఫిర్యాదులు: ఖతార్ కార్మిక శాఖ

- August 04, 2022 , by Maagulf
జూలైలో 473 ఉల్లంఘనలు.. 2,000 ఫిర్యాదులు: ఖతార్ కార్మిక శాఖ

దోహా: లేబర్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఇంటెన్సివ్ ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌లలో జూలై నెలలో 473 ఉల్లంఘనలను గుర్తించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో 3,693 తనిఖీలు నిర్వహించారు. దేశంలో కార్మిక మార్కెట్‌ను నియంత్రించడానికి సంబంధించిన చట్టాలు, మంత్రివర్గ నిర్ణయాలకు సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉన్నాయో పర్యవేక్షించడానికి తనిఖీలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపారు. కార్మిక సంబంధాల విభాగానికి 2,232 ఫిర్యాదులు అందాయని, వాటిలో 211 పరిష్కరించబడ్డాయని.. 827 ఫిర్యాదులను కార్మిక వివాదాల పరిష్కార కమిటీలకు సిఫార్సు చేశామని, దాదాపు 1,194 ఫిర్యాదులు ఈ ప్రక్రియలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంత్రిత్వ శాఖకు దాదాపు 4,692 కొత్త రిక్రూట్‌మెంట్ అభ్యర్థనలు వచ్చాయని, వాటిలో 2,680 ఆమోదించబడ్డాయని.. 2012 తిరస్కరించినట్లు తెలిపింది. జూలై నెలలో వర్క్ పర్మిట్‌ల కోసం దాదాపు 822 అభ్యర్థనలు వచ్చాయని, ఇందులో పర్మిట్‌ను పునరుద్ధరించడానికి 287.. కొత్త పర్మిట్ జారీకి 379.. జారీ చేసిన పర్మిట్‌లను రద్దు కోసం 156 అభ్యర్థనలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com