‘మెగాస్టార్ కళ్యాణ్ రామ్’.! ఇదెక్కడి వింత.?
- August 06, 2022
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రం రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. ఫాంటసీ నేపథ్యం కావడంతో, సినిమాకి ప్రేక్షకులు వస్తారా.? లేదా.? అనే అనుమానంతోనే ‘బింబిసార’ యూనిట్ వుంది.
కానీ, అంచనాల్ని తిరగరాసింది. ప్రేక్షకులు ‘బింబిసార’కు బాగానే ఎట్రాక్ట్ అయ్యారు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్. దాంతో, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా వుంటే, ‘#మెగాస్టార్ కళ్యాణ్ రామ్’ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది ఈ సందర్భంగా. ఇదెక్కడి విచిత్రం.? మెగాస్టార్నీ కళ్యాణ్ రామ్నీ కలిపేయడమేంటనీ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నందమూరి దురభిమానులు చేసిన పైత్యమే ఇదంతా అంటున్నారు.
లెజెండ్ మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ రామ్ని కలిపేయడమేంటని అంటున్నారు. ఇలా చేయడం కళ్యాణ్ రామ్కీ నచ్చలేదట.అయితే, నందమూరి ఫ్యామిలీకీ, మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే.
ఆ అనుబంధానికి చిచ్చు పెట్టడానికే కొందరు నందమూరి దురభిమానులు చేసిన సాహస కృత్యంగా ఈ చర్యను అభివర్ణిస్తున్నారు. ఇదిలా వుంటే, ‘బింబిసార’ సినిమా హిట్ అయినందుకు కళ్యాణ్ రామ్కీ, బింబిసార యూనిట్కీ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







