రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- August 06, 2022హైదరాబాద్: రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించారు. ఆదివారం రోజున మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, జనగామ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గ్రామాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాడు నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన