బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- August 07, 2022
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రస్తుతం బాసర లో పర్యటిస్తున్నారు. యూనివర్సిటీల విజిట్ లో భాగంగా.. ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీని పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు గవర్నర్ తమిళిసై. ట్రిపుల్ ఐటీలోని క్యాంప్ లో తిరిగారు. ఐటి మెస్, ల్యాబ్, తరగతి గదులను అధికారులతో కలిసి పరిశీలించారు. పలు విద్యార్ధులు గవర్నర్ కు సమస్యలను వివరించారు. తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఇంచార్జ్ వీసీ సహా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు.
గత కొన్ని రోజులు బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు పడకేసిన విషయం తెలిసిందే. అయితే.. సమస్యలు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే విద్యార్థులు పోరుబాట పట్టారు. అయితే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వెళ్లి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్రిపుల్ ఐటీ పరిశీలించారు. అంతక ముందు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు తమిళిసై. వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!