యూఏఈలో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన షార్జా ఛాంబర్
- August 08, 2022
షార్జా: యూఏఈ తో భారత దేశం వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి అని షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCC) అభిప్రాయ పడింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ పౌర సంబంధాల డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ శట్టాఫ్ మాట్లాడుతూ భారత దేశం తో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ లో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు భారత్ మరియు షార్జా ఛాంబర్ మధ్య కుదిరిన సమగ్రమైన ఏకానమిక్ భాగస్వామ్య ఒప్పందం (CEPA) దోహద పడుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో షార్జా భారత వాణిజ్య ఛాంబర్ అధ్యక్షుడు ప్రదీప్ సురేఖ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు యూఏఈ కీలకమైనది అని సైతం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..