భారత్ కరోనా అప్డేట్
- August 08, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 16,167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899కి చేరాయి. ఇందులో 4,34,99,659 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,730 మంది మృతిచెందారు. మరో 1,35,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మరో 41 మంది కరోనాకు బలవగా, 15,549 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 6.14 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.50 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 206.56 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







