ద్వేషాన్ని రెచ్చగొట్టే వైరల్ వీడియోల పట్ల జాగ్రత్త.. బహ్రెయిన్
- August 08, 2022
బహ్రెయిన్: సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అన్ని నిజమైనవి కాకపోవచ్చని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒరిజినల్‌గా కనిపించే వైరల్ ఫుటేజీలను షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇటీవలివిగా పేర్కొన్న అనేక వీడియో క్లిప్‌లపై దర్యాప్తు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దర్యాప్తులో చాల మటుకు పాత వీడియోలుగా తేలాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి అనేక సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. ఇతరుల దృష్టిని తేలికగా ఆకర్షించేందుకు, వారిని తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి విజువల్స్ తో కూడిన వీడియోలను షేర్ చేస్తుంటారని వివరించింది. ఇలాంటి వీడియోలతో పౌర శాంతికి భంగం కలిగించడం, ఇతరులకు హాని కలిగించే చర్యలు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..