10 మంది ATM మోసగాళ్లపై విచారణ.. పబ్లిక్ ప్రాసిక్యూషన్
- August 08, 2022
రియాద్: అనేక మంది ATM వినియోగదారులను మోసగించిన 10 మంది విదేశీయుల ముఠా నేరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.ముఠా సభ్యులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్ల తెలిపింది. ఈ ముఠాలో నలుగురు ప్రవాసులతోపాటు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 6 మంది వ్యక్తులు ఉన్నారని తమ దర్యాప్తులో వెల్లడైందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. సాయం చేస్తామని చెప్పి ATM వినియోగదారులను సదరు నిందితులు మోసం చేశారని వివరించింది. ఏటీఎం వినియోగదారుల రహస్య నంబర్లను సేకరించి.. ఆపై బ్యాంకు కార్డులను మార్పిడి చేసి మోసాలకు పాల్పడ్డారని తెలిపింది. నిందితులపై దర్యాప్తు ప్రక్రియలు పూర్తవుతాయని, ఆపై కేసులను సమర్థ న్యాయస్థానానికి పంపుతామని, వారికి కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. బ్యాకింగ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను నమ్మొద్దని, తమ బ్యాంకింగ్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







