షాకింగ్ న్యూస్: రొమాంటిక్ లైఫ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.!

- August 08, 2022 , by Maagulf
షాకింగ్ న్యూస్: రొమాంటిక్ లైఫ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ.!

‘నా రొమాంటిక్ లైఫ్ అస్సలు బాగోలేదు..’ అంటోంది అందాల భామ తాప్సీ. అదేంటీ.? తాప్సీకి పెళ్లే కాలేదుగా. రొమాంటిక్ లైఫ్ అంటోందేంటీ.? లేదంటే, తాప్సీకి ఏమైనా ఎఫైర్లు వున్నాయా.? ఆ దాఖలాలు కూడా లేవే.! అని ఆశ్చర్యపోతున్నారా.?

అసలింతకీ తాప్సీ రొమాంటిక్ లైఫ్ గురించి ఎందుకిలా మాట్లాడింది.? ఆ వివరాల్లోకి వెళ్లాలంటే, బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షో గురించి మాట్లాడుకోవాలి. అదేంటీ.? ఈ లింకేంటీ.? అంటారా.?

కాఫీ విత్ కరణ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోస్ట్ పాపులర్ రొమాంటిక్ షో ఇది. ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ అండ్ ప్రైవేట్ ఇష్యూస్‌కి సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటాడు మహానుభావుడు కరణ్ జోహార్.

ఈ మధ్య తాప్సీని ‘కాఫీ విత్ కరణ్’ షోకి వెళ్తారా.? అని ఓ ఇంటర్వ్యూలో ఎవరో అడిగారట. ఇప్పుడు అర్ధమై వుంటుంది. తాప్సీ ఎందుకు అలా మాట్లాడిందో. ఆ ప్రశ్నకు సమాధానంగానే తాప్సీ తన రొమాంటిక్ లైఫ్ గురించి ఇలా నిట్టూర్చింది. 

ఫాఫం.! తాప్సీ ఇంతవరకూ ప్రేమలో పడ్డట్లు వార్తలూ రాలేదు. ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన కూడా వున్నట్లు లేదు. మరి ఈ కరణ్ జోహార్ గారి షోలో ఏ రొమాంటిక్ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.? తద్వారా ఎలా సెన్సేషనల్ కాగలుతుంది.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com