ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- August 09, 2022
యూఏఈ: భారతదేశం ఫ్లాగ్ క్యారియర్, ఎయిర్ ఇండియా భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకుల కోసం అన్ని GCC స్టేషన్ల నుండి ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను ప్రారంభించింది. యూఏఈ నుండి ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా ప్రధాన భారతీయ నగరాలకు విమాన టిక్కెట్లను Dh330 కంటే తక్కువకే అందుబాటులోకి తీసుకొచ్చింది. "వన్ ఇండియా వన్ ఫేర్" కింద ఈ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఆగస్ట్ 8 – 21 మధ్య ప్రయాణీకులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా అక్టోబరు 15 వరకు ప్రయాణానికి ప్రమోషన్ వ్యవధిలో విక్రయించే అన్ని టిక్కెట్‌లపై చెక్ ఇన్ బ్యాగేజీ అలవెన్స్‌గా 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్ లగేజీని ప్రయాణికులకు అనుమతించినట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో సహా ఎయిర్ ఇండియా గల్ఫ్ కార్యకలాపాలు వారానికి 81,000 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ పిపి సింగ్ తెలిపారు. ఈ పథకం కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని, ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రతిపాదికన అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఛార్జీలు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్/మొబైల్ యాప్‌లో/అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్‌లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!