TSRTC బంపరాఫర్‌: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం

- August 09, 2022 , by Maagulf
TSRTC బంపరాఫర్‌: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టిన పిల్లలు 12 ఏళ్ల పాటు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను స్వతంత్ర వజ్రోత్సవాలుగా పేర్కొంటూ 12 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆగస్టు 15న పుట్టిన పిల్లలు 12 ఏళ్ల పాటు ఉచిత ప్రయాణం కల్పించేలా సరికొత్త ఆఫర్​ను ప్రకటించింది.

ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వీటితో పాటు టీ-24 బస్‌ టికెటును ఆ రోజున రూ.75( సాధారణ రోజుల్లో రూ.120)కే అందిస్తామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని సూచించారు.

32 మంది స్వాతంత్ర్య సమరయోధులను మననం చేసుకునేలా మూడు ప్రధాన బస్ స్టేషన్లు హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో ఈనెల 15 నుంచి 20 వరకు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. సంస్థ ప్రాంగణాల్లో రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపన చేయడంతోపాటు 13న నెక్లెస్ రోడ్ లో పరేడ్ నిర్వహించాలని అధికారులు తీర్మానించారు. అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏంటి అనే..

ప్రయాణికుల కోసం మరిన్ని సౌలతులు

  • 75 ఏళ్లు, ఆపై వయసుగల వృద్ధులు పంద్రాగస్టున ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే వారికి తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్​లో ఈనెల 15 నుంచి 22 వరకు ఉచిత హెల్త్​క్యాంప్​. 75 ఏండ్లలోపు వారికి రూ.750కే హెల్త్​ ప్యాకేజీ.
  • 24 గంటల పాటు హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణించే వెసులుబాటు ఉన్న టికెట్ అసలు ధర రూ.120 ఉంటే వజ్రోత్సవాల సందర్భంగా దానిని రూ.75కే అందిస్తారు.
  • తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్యాకేజీలు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆగస్టు 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు ఇస్తారు.
  • 15న హైదరాబాద్ సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ కు నడిచే పుష్పక్ సర్వీస్ లో 25 శాతం రాయితీ.
  • కిలో బరువుగల పార్సిల్​కు 75 కిలోమీటర్ల పరిధిలో 15న ఉచిత డెలివరీ. తరచూ ఎక్కువ దూరం ప్రయాణించే 75 మందిని గుర్తించి వారికి మరో ట్రిప్​ ఫ్రీ.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com