ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా కొత్త నిబంధనలు

- August 10, 2022 , by Maagulf
ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా కొత్త నిబంధనలు

  ఢిల్లీ: రుణ ఎగవేతదారులు, ఆర్థిక మోసాలకు పాల్పడిన ఇతరులతో సహా నేరస్థులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి  భారత ప్రభుత్వం సిద్ధమైంది. విదేశాలకు ప్రయాణించే ప్రయాణీకుల వివరాలను వారు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు పంచుకోవాలని విమానయాన సంస్థలను కోరింది. విమానయాన సంస్థలు అందించే సమాచారాన్ని పరిశీలనకు కొత్తగా నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్ - ప్యాసింజర్ (NCTC-P) ను ఏర్పాటు చేసింది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగమని పేర్కొంటూ ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్ 2022కి సంబంధించి నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎయిర్ లైన్స్ ఆపరేటర్ ప్రయాణీకుల రికార్డులను గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్‌లైన్ లేదా ఏజెన్సీ నిబంధనలను పాటించకపోతే రూ.25,000-రూ.50,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఎన్‌సిటిసి-పిని అమలు చేయడంలో ప్రధాన లక్ష్యం బ్యాంకు డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడమని.. గత ఐదేళ్లలో దాదాపు 40 మంది ఆర్థిక నేరగాళ్లు భారతదేశం నుంచి పారిపోయారని ప్రభుత్వం గతంలో పార్లమెంటుకు తెలియజేసింది. వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ (యుకెలో జైలులో ఉన్నారు),  మెహుల్ చోక్సీ (డొమినికాలో ఉన్నారు) కూడా ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com