తనను తాను పేల్చుకున్న నిందితుడు.. నలుగురికి గాయాలు
- August 13, 2022
సౌదీ: అరెస్టు సమయంలో నిందితుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయినట్లు భద్రతా అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెడ్డా గవర్నరేట్లోని అల్-సమేర్ జిల్లాలో నిందితుడయిన సౌదీ జాతీయుడు అబ్దుల్లా బిన్ జైద్ అబ్దుల్రహ్మాన్ అల్-బక్రీ అల్-షిహ్రీని వెంబడిస్తున్న క్రమంలో అతను తాను ధరించిన పేలుడు బెల్ట్ను పేల్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక ప్రవాసుడు, ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయాలయిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా రాజ్యం భూభాగాల్లో పౌరులు, ప్రవాసుల స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా ఎదుర్కోవడానికి రాష్ట్ర భద్రత విభాగం సిద్ధంగా ఉందని భద్రతా అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







