కదలకుండా కూర్చుంటే రోగాలు దరిచేరతాయి
- April 14, 2016
ఇంట్లో అయినా ఆఫీసులోనైనా సరే కదలకుండా కూర్చుంటే రోగాలు దరిచేరతాయి. ఈ విషయాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో పేర్కొంది. ఈ మేరకు 54 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడిందన్నారు. మనుషుల ప్రవర్తన, దేశ జనాభా, మరణాల సంఖ్య, ఇతర గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా దేశాల్లో సంభవించిన మరణాలను విశ్లేషించగా మూడు గంటల కంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కారణంగా సంభవించిన మరణాల శాతం 3.8. ఈ తరహా మరణాలు అమెరికా, యూరోపియన్, తూర్పు మధ్యదరా దేశాలతో పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో కూడా ఎక్కువేనని తేలింది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం కారణంగా కలిగే అనర్థాలను మనం శారీరకంగా ఎంత కష్టపడ్డా తగ్గించుకోలేమని పరిశోధకులు వెల్లడించారు.గంటల పాటు కూర్చుని ఉండే వాళ్లు గంటకోసారైనా లేచి రెండు, మూడు నిమిషాలు తిరగడం వల్ల అనారోగ్యం పాలవ్వకుండా ఉండవచ్చని ఆ జర్నల్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









