అక్రమ ఇ-బైక్ వినియోగదారులకు జరిమానాలు
- August 16, 2022
అబుధాబి: రాజధానిలో అనధికార ఎలక్ట్రిక్ బైక్‌లను నడుపుతున్న వ్యక్తులను అడ్డుకునేందుకు అబుధాబి పోలీసులు సిద్ధమయ్యారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ (ITC) సహకారంతో రెండు నెలల పాటు అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహించింది. అక్రమ వాహనాలను నడిపే వారికి అధికారులు జరిమానాలు విధిస్తున్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోలీసులు షేర్ చేశారు. నిలబడి నడపబడే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు జూన్‌లో ITC ప్రకటించిన విషయం తెలిసిందే. సీట్లు ఉన్న స్కూటర్లను నిషేధించినట్లు పేర్కొన్నారు. అబుధాబిలో సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగించవచ్చని, సీట్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై నిషేధం ఉందని అబుధాబి పోలీస్ పెట్రోల్ అండ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగ్ మహ్మద్ అల్ హెమెరీ తెలిపారు. సైక్లిస్ట్‌లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించాలని, నిర్దేశించిన ట్రాక్‌లపై మాత్రమే డ్రైవ్ చేయాలని బ్రిగ్ అల్ హెమెరి సూచించారు. అలాగే సైక్లిస్ట్‌లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి నిబంధనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







