భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌.. తొలి బ్యాచ్ టిక్కెట్ల అమ్మకం పూర్తి

- August 16, 2022 , by Maagulf
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌.. తొలి బ్యాచ్ టిక్కెట్ల అమ్మకం పూర్తి

యూఏఈ: ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దీనికి సంబంధించిన తొలి బ్యాచ్ టిక్కెట్ల విక్రయం పూర్తయిందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది. రెండున్నర గంటల్లోపే ప్లాటినం జాబితా  టిక్కెట్లన్ని అమ్ముడుపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. త్వరలోనే తదుపరి బ్యాచ్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తామని ఏసీసీ వెల్లడించింది. టిక్కెట్ల కోసం సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల నుండే క్యూలో నిలబడ్డామని.. సాయంత్రం 6 గంటలకు టికెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయని మధ్యాహ్నం నిర్వాహకులు ప్రకటించారని జఫర్ మహమూద్ అనే నివాసి తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు క్యూలో నిలబడ్డా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ టిక్కెట్ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్ లైన్ కొనుగోళ్లకు టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయని, సైట్ రెండుసార్లు క్రాష్ అయిందని మరో అభిమాని వాపోయాడు. ఇదిలా ఉండగా టిక్కెట్లు పొందిన కొందరు అభిమానులు వాటిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ఒక వ్యక్తి తన వద్ద నాలుగు టిక్కెట్లు ఉన్నాయని ట్విట్లర్ వేదికగా పోస్ట్ చేశాడు. దీనిపై నిర్వాహకులు స్పందించారు. టికెట్లను తిరిగి అమ్మడాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు. ఇతరుల నుంచి కొన్న టిక్కెట్లు చెల్లవని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com