బహ్రెయిన్ లో ఐఐటీ మద్రాస్ పరీక్షా కేంద్రం

- August 16, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ఐఐటీ మద్రాస్ పరీక్షా కేంద్రం

బహ్రెయిన్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ “BS ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్” ఆన్‌లైన్ బ్యాచిలర్ ప్రోగ్రామ్ కోసం బహ్రెయిన్‌లో తన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం వర్చువల్‌గా రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ముఖ్యవక్తగా పాల్గొంటారు.ఐఐటీ మద్రాస్ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విఘ్నేష్ ముత్తువిజయన్, బహ్రెయిన్ పరీక్షా కేంద్రం డైరెక్టర్ అబ్దుల్ జలీల్ అబ్దుల్లా హాజరుకానున్నారు. బహ్రెయిన్‌లో నివసిస్తున్న విద్యార్థులు IIT బ్యాచిలర్ డిగ్రీని సాధించడానికి ఇది మంచి అవకాశం అని అబ్దుల్ జలీల్ అబ్దుల్లా తెలిపారు. IIT బ్యాచిలర్స్, NPTEL, JEE మెయిన్, CUET, ACCA CBE, NIOS, NATA, Tally మొదలైన ప్రధాన పోటీ పరీక్షలకు లారెల్స్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వేదికగా మారుతున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. మరింత సమాచారం, మీటింగ్ లింక్ కోసం 33644193 లేదా 33644194 WhatsApp నంబర్‌లలో గ్లోబల్ ఎడ్యుకేషన్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com