ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

- August 16, 2022 , by Maagulf
ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సెజ్‌లోరూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం సెజ్‌లో తొలి దశలో రూ.1,384 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేయగా.. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దేశం కంటే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందన్నారు. గతంలో రాష్ట్రం వైపు చూడని వారు.. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో అడుగు పెట్టని ఆదాని.. తాను సీఎం అయ్యాకే.. ఆదాని అడుగులు ఏపీ వైపు పడ్డాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతోనే ఏటీసీ రెండో ఫేజ్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు.

ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్‌ పనులు పూర్తి చేసే అవకాశం ఉందని.. ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి అన్నారు. ఈ మూడేళ్లలో 17 భారీ పరిశ్రమల ద్వారా రూ.39వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ప్రభుత్వం పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. మూతపడ్డ MSMEలకు కూడా చేయూతనిస్తున్నామని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మరో 56 కంపెనీలు రాబోతున్నాయని.. మొత్తం రూ.1.54కోట్లతో లక్ష మందకిపైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని ఏటీసీ కంపెనీ సీఈవో నితిన్‌ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని.. ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లాంట్‌గా యూనిట్‌ను తయారు చేస్తామన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com