అత్యధిక సగటు జీతం.. 5వ స్థానంలో బహ్రెయిన్

- August 19, 2022 , by Maagulf
అత్యధిక సగటు జీతం.. 5వ స్థానంలో బహ్రెయిన్

బహ్రెయిన్: కార్మికులకు అత్యధిక సగటు నెలవారీ జీతంతో గల్ఫ్‌లో బహ్రెయిన్ ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో ఉంది. యూఎస్ మ్యాగజైన్ CEO వరల్డ్ వర్గీకరణ ప్రకారం.. రాజ్యం $1,728.74 సగటు నెలవారీ వేతనం నమోదయింది. జాబితాలో కనీసం 105 దేశాలకు ర్యాంకింగ్ కేటాయించారు. సగటు నెలవారీ వేతనాలలో ఐదు గల్ఫ్ దేశాలు మధ్యప్రాచ్యంలో మొదటి ఐదు స్థానాల్లో నిలవడం గమనార్హం. యూఏఈ $3,663.27 సగటు నెలవారీ జీతంతో గల్ఫ్  ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com