ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురికి జైలు శిక్ష
- August 19, 2022
దుబాయ్: ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురిని దుబాయ్ దుర్వినియోగాలు, ఉల్లంఘనల కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒక ఆసియన్ షిప్ కెప్టెన్(43), మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నిందితులకు ఒక నెల జైలు శిక్షతోపాటు మూడు సంవత్సరాల ఉద్యోగ సస్పెన్షన్‌ను కోర్టు విధించింది. ప్రమాదంలో ఓడకు జరిగిన నష్టానికి Dh100,000 జరిమానా విధించింది. దీనితోపాటు వారి కేసును దుబాయ్ సివిల్ కోర్టుకు రిఫర్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జెబెల్ అలీ పోర్ట్‌లోని ఓడలో మంటలు చెలరేగి 24 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని కోర్టు పేర్కొంది. గతేడాది జూలైలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్‌లోని ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్దేశించిన భద్రతా చర్యలను పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి.
తాజా వార్తలు
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు







