భారత్ కరోనా అప్డేట్
- August 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతునే ఉన్నాయి. మంగళవారం 8 వేలకు తగ్గిన రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 12 వేల మందికిపైగా కరోనా నిర్ధారణకాగా, నేడు ఆసంఖ్య 15,754కు చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి పెరిగింది. ఇందులో 4,36,85,535 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,01,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంనిణీ చేశామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







