దుబాయ్ లాటరీలో 50లక్షల దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు
- August 19, 2022
దుబాయ్: దుబాయ్‌లో మరో భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది.దీంతో 50లక్షల దిర్హాములుగెలుచుకున్నాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన షాన్వాజ్ 15 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గడిచిన ఏడాదిన్నరగా దుబాయ్ ఆన్‌లైన్ లాటరీలో పాల్గొంటున్నాడు. ఇటీవల షాన్వాజ్ కొనుగోలు చేసిన 7, 9, 17, 19, 21 నంబర్ సిరీస్‌కు తాజాగా జాక్‌పాట్ తలిగింది. దీంతో మొదటి ప్రైజ్ కింద 50లక్షల దిర్హాములు గెలుచుకున్నాడు. ఇంతా భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల షాన్వాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ నగదులో కొంత మొత్తం తన అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తానని చెప్పిన షాన్వాజ్.. మిగిలిన సొమ్ముతో దుబాయ్‌లో బిజినెస్ ప్రారంభిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే లాటరీలో మరో ఇద్దరు విదేశీయులు కూడా చెరో 50లక్షల దిర్హాములు గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







