సల్మాన్ ఖాన్ తో కలిసి చరణ్, ఓ మల్టీ స్టారర్ సినిమా ..

- April 15, 2016 , by Maagulf
సల్మాన్ ఖాన్ తో కలిసి చరణ్, ఓ మల్టీ స్టారర్ సినిమా ..

టాలీవుడ్ లో మెగా వారసుడిగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్, బాలీవుడ్ ఆశలు మాత్రం చంపుకోలేకపోతున్నాడు. ఎన్నో ఆశలతో చెర్రీ చేసిన బాలీవుడ్ ఎంట్రీ 'జంజీర్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో తరువాత బాలీవుడ్ ఆలోచన పక్కన పెట్టేశాడు. అయితే పూర్తిగా మాత్రం కాదు. కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్ తో కలిసి చరణ్, ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త, బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ వార్తల పై స్పందించిన చెర్రీ అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు. అయితే జంజీర్ సినిమా సమయంలోనే సల్మాన్, తన సొంత బ్యానర్ లో చరణ్ హీరోగా సినిమాను నిర్మిస్తానని మాట ఇచ్చాడట. ప్రస్తుతం ఆ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారని, అన్నీ కుదిరితే సల్మాన్ బ్యానర్ లో మరోసారి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటానంటున్నాడు. మరి సల్మాన్ అయిన చరణ్ కు బాలీవుడ్ లో బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com