ప్రబాస్-మారుతి త్వరలోనే మొదలెట్టేస్తారట.!
- August 24, 2022
మారుతి డైరెక్షన్లో ప్రబాస్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే, ప్రబాస్ ప్యాన్ ఇండియా స్టార్. అలాంటిది ఓ సాధారణ డైరెక్టర్ అయిన మారుతితో సినిమా చేస్తాడా.? ఏదో అలా అనౌన్స్ చేసేశాడు కానీ, ఇదేమీ జరిగి ఒరిగేది కాదులే.. అనుకున్నారంతా.
ఇటీవలే ‘పక్కా కమర్షయల్’ సినిమా టైమ్‌లో కూడా ప్రబాస్ సినిమా గురించి మారుతి ప్రస్థావించిన సంగతి తెలిసిందే. అయినా నమ్మలేదెవ్వరు. కానీ, త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేయనుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుందట.
ప్రబాస్ ఇమేజ్‌కి దూరంగా, పక్కా ఎంటర్టైన్మెంట్ కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందనుందని గతంలోనే మారుతి చెప్పేశాడు. ప్రబాస్ అంటే, భారీ యాక్షన్స్, భారీ నుంచి అతి భారీ సెట్టింగ్స్.. ఇలా ఊహిస్తుంటారు.
‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ చేస్తున్న సినిమాలన్నీ ఆ కోవకు చెందినవే వుంటున్నాయ్. అలాంటిది మారుతి అవేమీ లేకుండా సాధారణంగా ప్రబాస్‌ని చూపిస్తాడా.? లేక, ప్రబాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా, ఆ ఆంబియన్స్లోనే సినిమా తెరకెక్కిస్తాడా.? అనేది మాత్రం తెలియాల్సి వుంది. అయితే, ఈ కాంబినేషన్ మూవీ పక్కా ఎంటర్టైనర్. ఇది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







