అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా విస్తారా సర్వీసులు

- August 25, 2022 , by Maagulf
అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా విస్తారా సర్వీసులు

అబుధాబి: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచరయిన విస్తారా విమానయాన సంస్థ అక్టోబర్ 1 నుంచి అబుధాబికి నేరుగా కొత్త సర్వీసులను(A320neo విమానం) నడుపనుంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ కోసం వరుసగా $222 (AED 799), $288 (AED 1,199), $576 (AED 3,999) ప్రత్యేక రౌండ్‌ట్రిప్ ఛార్జీలను ఖరారు చేసింది. ముంబై - అబుధాబిల మధ్య గ్రేటర్ కనెక్టివిటీ రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం, పర్యాటక అవసరాలను పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కన్నన్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com