సౌదీలో విదేశీ న్యాయ సంస్థలకు కొత్త లైసెన్స్ నిబంధనలు

- August 27, 2022 , by Maagulf
సౌదీలో విదేశీ న్యాయ సంస్థలకు కొత్త లైసెన్స్ నిబంధనలు

సౌదీ: విదేశీ న్యాయ సంస్థలకు లైసెన్సుల అమలు నిబంధనలను సౌదీ న్యాయ శాఖ మంత్రి వాలిద్ అల్-సమానీ గురువారం నాడు ఆమోదించారు.న్యాయ అభ్యాసాన్ని అభివృద్ధి చేయడం, న్యాయవాదులకు అధికారం కల్పించడం, రాజ్యంలో వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.తాజా నిబంధనలలో లైసెన్సింగ్, వాటి పరిధి, విదేశీ న్యాయ సంస్థల విధులు, తాత్కాలిక లైసెన్స్‌ల అవసరాలు, విదేశీ న్యాయ సలహాదారులను నియమించే విధానాలు ఉన్నాయన్నారు. స్థానిక న్యాయ నిపుణులతో జ్ఞానాన్ని పంచుకోవడం, శిక్షణ - అభివృద్ధి, విదేశీ వ్యాపారాలు, పెట్టుబడిదారులకు అవకాశాలు సృష్టించడంపై కొత్త నిబంధనలు దృష్టి సారిస్తాయని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com